: కీలక జీఎస్‌టీలకు ఆమోదం.. చిన్న వ్యాపారులకు భారీ ఊతం
గతేడాది పార్లమెంటులో ఆమోదం పొందిన జీఎస్‌టీ సవరణల బిల్లును కేంద్ర ప్రభుత్వం వచ్చేనెల 1 నుంచే అమలు చేయాలని చూస్తోన్న విషయం తెలిసిందే. ఈ బిల్లుపై ఇప్పటికే పలుసార్లు చర్చించిన జీఎస్‌టీ కౌన్సిల్.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో ఈ రోజు ముంబైలో మరోసారి సమావేశమై 11 కీలకమైన చట్టాలను ఆమోదించింది.
ఆ చర్చలన్నీ ఫలప్రదంగా జరగడంతో సెంట్రల్ జీఎస్‌టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ చట్టాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ చట్టాలకు సంబంధించి తుది ఆమోదాన్ని తదుపరి సమావేశంలో సాధించనున్నారు. జీఎస్‌టీ అమలు కానున్న నేపథ్యంలో రాష్ట్రాల సాధికారతకు కేంద్ర సర్కారు ఒప్పుకోవడంతో చిన్న వ్యాపారులకు లాభం చేకూరనుంది. పన్ను పరిధులకు సంబంధించిన ఫిట్‌మెంట్ అంశాలతో పాటు పలు అంశాలపై ఇంకా చర్చించాల్సి ఉంది.