: అమెరికాలో మరో భారతీయుడి కాల్చివేత.. ఇంటి బయటే కాల్చి చంపిన దుండగులు!


అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ ను తెల్లజాతీయుడు కాల్చి చంపిన ఘటనను మరవక ముందే... మరో భారతీయుడు అమెరికన్ల తూటాలకు బలయ్యాడు. సౌత్ కరోలినాలో భారత వ్యాపారవేత్తను దుండగులు కాల్చి చంపారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన హర్నీష్ పటేల్ ను ఆయన ఇంటి బయటే చంపేశారు. ఈ కాల్పుల వార్తతో అమెరికాలో ఉన్న భారతీయులు మరోసారి షాక్ కు గురయ్యారు. తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News