: షాక్ కొట్టి 100 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు.. అయినా బతికాడు!
‘జనన, మరణాలు మన చేతుల్లో ఉండవు.. అంతా ఆ పైవాడు ఎలా రాసి పెట్టి ఉంటాడో అలాగే జరుగుతాయి.. మనం కావాలనుకొని ముందుగానే ఆ దేవుడి దగ్గరికి వెళ్లాలన్నా వెళ్లలేం’ అంటూ పెద్దలు వేదాంతం చెబుతుంటే ఏంటో చాదస్తం అనుకుంటాం. అయితే, ఆ యువకుడికి ఇంకా ఆయుష్షు రాసి పెట్టి ఉందేమో.. అందుకే ఏకంగా 30వేల వోల్ట్స్ విద్యుత్ సరఫరా అవుతున్న హైటెన్షన్ వైరు తగిలి, 100 అడుగుల టవర్‌పై నుంచి కిందకు పడిపోయినా బతికాడు.
100 అడుగుల టవర్ మీద ఉండి పనిచేసుకుంటుండగా అతడికి ఒక్కసారిగా షాక్ తగిలి మంటలు చెలరేగాయి. దీంతో కిందపడిపోయాడు.. అయినా బతికి నడుచుకుంటూ గాయాలతో వచ్చాడు. కాలిపోయిన శరీరంతో బాధపడుతూ నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లిపోయాడు. ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోన్న ఈ వీడియోను మీరూ చూడండి. విదేశాల్లో జరిగిన ఈ ఘటన వీడియోపై పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.