: ఎల్బీగా ఔటయిన టీమిండియా ఓపెనర్.. ప్రస్తుత స్కోరు 51/1
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు మ్యాచులో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో బాధపడుతున్న మురళీ విజయ్ స్థానంలో అభినవ్ ముకుంద్ ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చాడు. అయితే డకౌట్‌గా వెనుదిరిగి టీమిండియా అభిమానులను నిరాశపర్చాడు. మూడవ ఓవర్‌లో స్టార్క్ వేసిన యార్కర్ లెంగ్త్ బంతిని అంచనా వేయలేక ఎల్బీగా ఔటయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్.. క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి నిలకడగా ఆడుతున్నాడు. రాహుల్ 38, పుజారా 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 20 ఓవర్లకి భారత్ స్కోరు వికెట్ నష్టానికి 51 పరుగులుగా ఉంది. మొదటి టెస్టులో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో భారత బ్యాట్స్‌మెన్ ఉన్నారు.