: అఖిలేష్.. రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండండి!: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సూచన


ఉత్తరప్రదేశ్‌లో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల పోరులో విజయం తమదేనని ఇటు అధికార సమాజ్‌వాదీ పార్టీ, అటు బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. సమాజ్‌వాదీ పార్టీ ఓటమి ఖాయమని ఇప్పటికే తేలిపోయిందని, ఈనెల 11న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలని సూచించారు. యూపీలో గెలుపుతో పట్టుపెంచుకోవాలని చూస్తున్న బీజేపీ ఇక్కడ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. మరో రెండు విడతల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌తో జతకట్టిన ఎస్పీ విజయం తమదేనని, ప్రజలు మరోమారు తమకే పట్టం కడతారని ముఖ్యమంత్రి అఖిలేష్ ధీమాగా ఉన్నారు.

  • Loading...

More Telugu News