: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దిశాపటానీ డ్యాన్స్ వీడియో
'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లో మెరిసి, హాలీవుడ్ సినిమా 'కుంగ్ ఫూ యోగా'తో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన హీరోయిన్ దిశా పటానీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. 'షేప్ ఆఫ్ యూ' అనే పాటకు కొరియోగ్రాఫర్ హర్షవర్థన్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ పాటకు ఇప్పటి వరకు ఎన్నో రకాలైన డ్యాన్సులు ఆన్ లైన్ లో ఉన్నప్పటికీ దిశా పటానీ వేసిన స్టెప్పులే అదిరిపోయాయని ఆమె అభిమానులు కితాబునిచ్చేశారు. ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసిన ఈ వీడియో యూట్యూబ్ లో కూడా హల్ చల్ చేస్తోంది. కావాలంటే మీరు కూడా దిశా డ్యాన్స్ చూడండి...ఫిదా అయిపోతారు.