: 50 నిమిషాల్లో 3 లక్షల వ్యూస్ సాధించిన పవన్ కల్యాణ్ 'మిరా మిరా మీసం' పాట


పవన్ కల్యాణ్ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానుల ముందుకు నిర్మాత శరత్ మరార్ తొలి పాటను తీసుకొచ్చారు. కాటమరాయుడు సినిమాలోని 'మిరామిరా మీసం..' అంటూ సాగే పాటను విడుదల చేస్తానని ప్రకటించిన విధంగానే ఆయన తన నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ అధికారిక యూట్యూబ్ లో విడుదల చేసి, దానిని ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. దీంతో ఎప్పుడెప్పుడా? అని ఎదరు చూస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులు ఈ పాటను ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో పాటను విడుదల చేసిన 50 నిమిషాల్లో 3 లక్షల వ్యూస్ ను ఇది సాధించడం విశేషం.

'రాయుడు... నాయకుడై.. నడిపించేవాడు... సేవకుడై... నడుమొంచేవాడు...అందరి కొసమై అడుగేశాడు.... రాయుడు....మిరా మిరా మీసం మీరు తిప్పుతు ఉంటే' అంటూ ఈ పాట సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా, అనూప్ రూబెన్స్ దీనికి సంగీత దర్శకత్వం వహించారు.  

  • Loading...

More Telugu News