: సుస్మితాసేన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదేనట!


మాజీ విశ్వ సుందరి, ప్రముఖ సినీ నటి సుస్మితాసేన్ (41) పెళ్లి విషయంపై ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? అంటూ సుస్మితను సాధారణంగా మీడియా ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇదే విషయాన్ని ఆమెను ఆమె సన్నిహితులు కూడా అడుగుతూనే ఉంటారు. ఈ క్రమంలో, తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది సుస్మిత.

నిప్పులాంటి తనతో జీవించగల వ్యక్తి ఇంత వరకు తనకు తారసపడలేదని సుస్మిత చెప్పింది. ఒంటరిగా ఉండటమా? లేక జంటగా ఉండటమా? అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. తనతో కలసి జీవించగలిగిన వ్యక్తి తారసపడితే, పెళ్లి చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అన్నట్టు, సుస్మితకు పెళ్లి కాకపోయినా... రెనీ (16), అలీసా (8)లను దత్తత తీసుకుని, పెంచుకుంటోంది. 

  • Loading...

More Telugu News