: విమాన వాహక యుద్ధనౌకపై నిలబడి ట్రంప్ ప్రసంగం.. సైన్య విస్తరణకు ఆదేశాలు


అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌మ దేశ సైన్య విస్త‌ర‌ణపై దృష్టిపెట్టారు. రెండు నెల‌ల క్రితం ప్ర‌మాణ స్వీకారం చేసిన ఆయ‌న‌.. ఆ వెంట‌నే సైన్య విస్తరణ, కొత్త విమానాలు, నౌకలకు సంబంధించి కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంత‌కం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న‌ అమెరికా సరికొత్త విమాన వాహక యుద్ధనౌకపై నిలబడి ప్రసంగించారు. త‌మ దేశ‌ రక్షణ బడ్జెట్‌కు పరిమితులు ఉండరాదని ఆయ‌న చెప్పారు. నావికాదళ విస్తరణ ప్రణాళికలపై చర్చించాలని సూచించారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలోని అతి చిన్న నౌకాదళమే ఇప్పుడూ ఉందని ఆయ‌న గుర్తు చేశారు.

అమెరికాలో కనీసం 12 విమాన వాహక నౌకలు ఉండాలని, ప్రస్తుతం 10 మాత్రమే ఉన్నాయని ఆయ‌న అన్నారు. 12.9 బిలియన్‌ డాలర్లతో రూపొందించిన ఫోర్డ్‌ నౌక కొన్ని రోజుల్లోనే జలప్రవేశం చేయనుంది. మ‌రోవైపు జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ నౌక నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం రక్షణ రంగానికి అమెరికా బ‌డ్జెట్‌లో 54 బిలియన్‌ డాలర్లు కేటాయిస్తున్నారు. దీనిని మరో 10 శాతం పెంచాలని ట్రంప్ అన్నారు.

  • Loading...

More Telugu News