: మెనోపాజ్‌ మహిళలకో శుభవార్త


మహిళలు మెనోపాజ్‌ దశకు చేరుకున్న తరువాత పలు ఆనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పాల్సింది కండరాల సమస్యలు. వయసు పైబడిన తర్వాత సహజంగా కండరాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ కారణంగా ఎందరో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. మోకాళ్ల నొప్పులు వంటి పలు కండరాల సమస్యలతో వారు సతమతమవుతుంటారు. అయితే వీటన్నిటికీ ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు డాక్టర్‌ లార్స్‌ లార్సన్‌.........

స్వీడన్‌లోని ఉప్సల విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ లార్స్‌ లార్సన్‌ మహిళల్లో హార్మోన్‌ చికిత్స ద్వారా కండరాల పనితీరును మెరుగుపరచవచ్చని తెలుసుకున్నారు. పలు అధ్యయనాల ద్వారా వయసుతోబాటు వచ్చే కండరాల సమస్యలను హార్మోన్‌ చికిత్స (హెచ్‌ఆర్‌టి) తగ్గించడాన్ని ఆయన గమనించారు. హార్మోన్‌ చికిత్స వల్ల కండరాలు బలంగా కాకపోయినా వాటి పనితీరు మాత్రం కాస్త మెరుగు పడడాన్ని ఆయన గమనించారు. కండరాలకు సంబంధించిన సమస్యలున్న మహిళలకు నిజంగా ఇది ఒక శుభవార్తే.

  • Loading...

More Telugu News