: నేటి సాయంత్రం 4 గంటలకు 'మిరామిరా మీసం...' తిప్పనున్న కాటమరాయుడు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల్లో 'కాటమరాయుడు' ఫీవర్ ప్రారంభమైంది. నేటి సాయంత్రం చిత్రంలోని తొలి పాటను విడుదల చేయనున్నట్టు నిర్మాత శరత్ మరార్ తెలియజేశారు. సినిమాలోని 'మిరామిరా మీసం...' అంటూ సాగే పాటను నేడు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఆపై వరుసగా పాటలు విడుదలవుతాయని నార్త్ స్టార్ ఎంటర్ టెయిన్ మెంట్ అధికారిక ఫేస్ బుక్ పేజీలో శరత్ మరార్ పేర్కొన్నారు. ఇదే సమయంలో చిత్రంలో పవన్ కొత్త లుక్ తో కనిపిస్తున్న ఫోటోను ఆయన పోస్టు చేశారు. ఇదిలావుండగా, ఇటీవల అల్లు అర్జున్ తాజా చిత్రం 'డీజే - దువ్వాడ జగన్నాథం' టీజరుపై పడ్డ డిస్ లైక్ ల వార్ వ్యవహారం, పవన్ పాటపై ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని మెగా అభిమానుల్లో చర్చ సాగుతోంది.