: ఆ ఎమ్మెల్యే వివాహ ఆహ్వాన వీడియో అదుర్స్!
భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు రావ్‌సాహెబ్ పాటిల్ దన్వే కుమారుడి వివాహం నిన్న అతిరథ మహారథుల నడుమ ఆకాశమంత పందిరిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆయన కుమారుడు 2014 ఎన్నికల్లో భోకార్దన్ నియోజక వర్గం నుంచి ఎంఎల్ఏగా కూడా ఎన్నికయ్యాడు. ఔరంగాబాద్ శివార్లలోని జబిందా ఎస్టేట్‌లో ఆయన పెళ్లి జరిగింది.
రాజప్రాసాదాన్ని తలపించేలా పెళ్లి మండపం ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి ఆహ్వానానికి సంబంధించి రూపొందించిన వీడియోను సంతోశ్ ఈ రోజు తన ఫేస్బుక్ ఖాతాలో ఉంచాడు. పెళ్లి కూతురితో కలిసి పెళ్లికొడుకు సైకిల్ తొక్కుతూ, పార్క్‌లో డ్యాన్స్ వేస్తూ ఉన్న ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆహ్వాన వీడియోనే ఇంత అద్భుతంగా ఉంటే నిన్న జరిగిన ఆయన పెళ్లి ఇంకా ఎంత అద్భుతంగా నిర్వహించారో అని ఆయన ఫాలోవర్లు అంటున్నారు.