: ఆడుకుంటూ.. నీళ్ల బ‌కెట్‌లో ప‌డి చిన్నారి మృతి!


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు న‌వ్వుతూ కేరింత‌లు కొడుతూ ఆడుకుంటున్న ఓ చిన్నారి నీళ్ల బ‌కెట్‌లో ప‌డి ప్రాణాలు కోల్పోయింది. ఆ పాప వ‌య‌సు ఏడాదిన్న‌ర అని, ఈ రోజు ఉద‌యం ఇంటి ముందు నీటితో నింపి ఉన్న బ‌కెట్ వ‌ద్ద ఆడుకుంటూ ఒక్క‌సారిగా దానిలో ప‌డిపోయింద‌ని స్థానికులు చెప్పారు. ఆ పాప‌ను బ‌కెట్ నుంచి తీసి ఆమె ప్రాణాలు కాపాడేందుకు తాము చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదని స్థానికులు తెలిపారు. రోజూ ఇంట్లో అల్ల‌రి చేస్తూ క‌నిపించే ఆ చిన్నారి ఇకలేద‌ని ఆ పాప త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.

  • Loading...

More Telugu News