: ఐపీఎల్ పదవ‌ సీజన్‌ పై రూపొందించిన పాటకు భారీ స్పందన!


త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2017 కోసం అన్ని ఏర్పాట్లు చ‌క‌చ‌కా పూర్త‌వుతున్నాయి. ఐపీఎల్‌ పదవ‌ సీజన్‌ వచ్చే నెల 5న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్‌పై రూపొందించిన థీమ్‌ సాంగ్‌ను రెండు రోజుల క్రితం విడుద‌ల చేశారు. ఐపీఎల్ పదవ‌ సీజన్‌లో అడుగుపెడుతున్న సందర్భంగా ‘దస్‌ సాల్‌ ఆప్కే నామ్‌’ అనే టైటిల్‌తో రూపొందించిన ఈ పాట క్రికెట్ అభిమానుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటోంది.

బాలీవుడ్‌ సంగీత దర్శకుడు సలీమ్‌-సులేమాన్‌ సంగీతం అందించిన ఈ పాట‌ను బెన్నీ డాయల్ పాడారు. ప్ర‌ముఖ సంస్థ‌ సోనీమ్యాక్స్ ఈ పాట‌కు సంబంధించిన‌ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేయ‌గా కేవ‌లం 48 గంటల్లోనే 25లక్షల మందికి పైగా అభిమానులు ఈ వీడియోను చూశారు. ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News