: క్వశ్చన్ పేపర్ లీక్.. సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ప్రశ్నాపత్రం
ఇంటర్మీడియెట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన ఉదంతం కలకలం రేపుతోంది. కడపలో ఇంగ్లీష్ పేపర్ సెట్-3 లీక్ అయింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని ఆర్ఐఓ రవి తెలిపారు. లీకైన ప్రశ్నాపత్రం ఇప్పటిదా? లేక గత సంవత్సరానిదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే, ఇవాల్టి పరీక్షకు సెట్-1 ప్రశ్నాపత్రాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ ప్రశ్నాపత్రం ఓ ప్రైవేట్ కాలేజీ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.