: క్యాబ్ డ్రైవర్లు కిడ్నాప్ చేసిన యువతి ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్!


హైదరాబాద్ లోని ఎల్బీనగర్ బస్టాప్ లో వేచి ఉన్న యువతిని క్యాబ్ లోకి ఎక్కించుకుని, దాదాపు 45 కిలోమీటర్ల దూరం ఆమెను తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. విజయవాడ వెళుతున్న క్యాబ్ డ్రైవర్ ఓ సీటు ఖాళీగా ఉందని ఆమెను కారులోకి ఎక్కించుకున్నాడు. అప్పటికే క్యాబ్ లో మరో యువకుడు ఉన్నాడు. క్యాబ్ కొంచెం దూరం వెళ్లగానే ఆమెతో వీరు అసభ్యంగా ప్రవర్తించారు. అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో, చౌటుప్పల్ సమీపంలోని టోల్ గేట్ వద్దకు చేరుకోగానే ఆమె కారు నుంచి కిందకు దూకి, కేకలు వేసింది. దీంతో, టోల్ గేట్ సిబ్బంది ఆమెను రక్షించి, నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరిద్దరిపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే, క్యాబ్ డ్రైవర్లు కిడ్నాప్ చేసిన యువతి హైదరాబాదులోని గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. ఈమెది గుంటూరు జిల్లా. తన ఊరు వెళ్లే క్రమంలో, విజయవాడ బస్సు ఎక్కడానికి ఎల్బీనగర్ బస్టాప్ లో వేచి ఉండగా, క్యాబ్ డ్రైవర్లు ఆమెను నమ్మించి, కారు ఎక్కించుకుని, ఆపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు.

  • Loading...

More Telugu News