: మీరు ఇప్పటికే ఎంతో మంది తలలు తీశారుగా!: ఆర్ఎస్ఎస్ కు కేరళ సీఎం కౌంటర్
కేరళ సీఎం పినరయి విజయన్ తల నరికి తెస్తే కోటి రూపాయలు నజరానాగా ఇస్తానంటూ ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలపై పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే ఎంతో మంది తలలను తీసుకుందని అన్నారు. ఈ బెదిరింపులకు భయపడేది లేదని, తన ప్రయాణాన్ని, తన పనులను తాను చేసుకుపోతానని చెప్పిన విజయన్ నవ్వులు చిందించడం గమనార్హం. కాగా, ఈ వ్యాఖ్యలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. సీఎంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఆయన మండిపడ్డారు.