: కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ మంత్రివర్గ సమావేశం!
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలోని కొత్త సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల ఆరునుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, అమరావతి నిర్మాణ పనులతో పాటు పలు అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శులు, పలు విభాగాధిపతులు కూడా పాల్గొన్నారు. గన్నవరం, రేణిగుంట ఎయిర్‌పోర్టులకు కొత్త పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అమరావతి నిర్మాణంలో మంత్రులు, అధికారుల అభిప్రాయాలు తీసుకునేందుకు ఇకపై తరచూ సమావేశాలు నిర్వహిస్తామని చంద్రబాబు అన్నారు. అమరావతిలో నిర్మించనున్న 8 నగరాలు, 27 టౌన్ షిప్‌లకు సలహాలు ఇవ్వాలని సీఎం చెప్పారు.