: ఫలించిన టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రయత్నం.. వరంగల్ కు పాస్ పోర్టు సేవా కేంద్రం!
వరంగల్ నగరంలో పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీ కవితకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ లేఖ రాశారు. వరంగల్ లో పాస్ పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ గతంలో కవిత పార్లమెంటులో విన్నవించారు. ఈ నేపథ్యంలో, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన పోస్టాఫీసుల్లో సైతం పాస్ పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలనే విధానపరమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న సంగతి తెలిసిందే.