: నిరాశ చెందుతున్న రిలయన్స్ జియో యూజర్లు!


రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విధంగానే జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కార్యక్రమం నిన్న‌టి నుంచి ప్రారంభమైన విష‌యం తెలిసిందే. రూ.99 తో ప్రైమ్ మెంబర్‌షిప్ పొందితే ప‌లు స‌దుపాయాలు పొంద‌వ‌చ్చ‌ని రిల‌య‌న్స్ అధినేత చేసిన ప్ర‌క‌ట‌న‌తో జియో యూజ‌ర్లు ఇప్పుడు ఆ ప‌నిలోనే ప‌డ్డారు. అందుకోసం ఆన్‌లైన్‌లో జియో యాప్ ద్వారా గానీ, జియో స్టోర్‌కు గానీ వెళ్లి ప్రైమ్ సభ్యులుగా నమోదు చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అయితే జియో యూజర్లలో చాలామందికి నిరాశ ఎదురవుతోంది. ఆన్‌లైన్ ద్వారా ఈ సభ్య‌త్వం పొందాల‌ని చూస్తోన్న వారికి కొన్ని సాంకేతిక సమస్యలు ఎదుర‌వుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన జియో యాజ‌మాన్యం ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలుపుతూ.. త్వరలోనే మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. మ‌రికొంద‌రు జియో యూజ‌ర్లు ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించినప్పటికీ, తమకు ప్రైమ్ యాక్టివేట్ కాలేద‌ని వాపోతున్నారు.

  • Loading...

More Telugu News