: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన జగన్
ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత జగన్ నేడు ప్రకటించారు. గత నాలుగు రోజులుగా అభ్యర్థుల ఎంపికపై పార్టీ సీనియర్ నేతలతో జగన్ విస్తృతంగా చర్చించారు. సీనియర్ల సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తీసుకున్న తర్వాత అభ్యర్థుల పేర్లను ఆయన ఖరారు చేశారు.
ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థులు...
1. గంగుల ప్రతాప్ రెడ్డి (ఆళగడ్డ-కర్నూలు జిల్లా)
2. ఆళ్ల నాని (ఏలూరు-పశ్చిమగోదావరి జిల్లా)