: అమరావతి నూతన అసెంబ్లీ స్పెషాలిటీస్ ఇవిగో!


ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నూతన అసెంబ్లీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ అసెంబ్లీ స్పెషాలిటీస్ ఇవే...

  • సచివాలయం ప్రాంగణంలోని రెండు ఎకరాల స్థలంలో అసెంబ్లీని నిర్మించారు. 
  • ఒకే సముదాయంలోనే అసెంబ్లీ, సచివాలయాలను ఏర్పాటు చేశారు. 
  • మొత్తం 260 మంది కూర్చునేలా అసెంబ్లీని నిర్మించారు. 
  • 90 మంది కూర్చునేలా శాసనమండలిని నిర్మించారు. 
  • అసెంబ్లీలో స్పీకర్ ఛైర్ ను అత్యంత ఆకర్షణీయంగా తయారు చేశారు. ఏడు అడుగుల ఎత్తులో స్పీకర్ ఛైర్ ను ఏర్పాటు చేశారు. 
  • స్పీకర్ ఛైర్ కు ఇరువైపులా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 
  • సభ్యుల వద్ద సెన్సర్ మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో, మైకులు విరగ్గొట్టడం కుదరదు. 
  • ముఖ్యమంత్రికి, స్పీకర్ కు ప్రత్యేక సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. 
  • అసెంబ్లీలో ఐదు అత్యాధునిక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీటిలో మీడియాకు 2, అధికారులు, వీఐపీలకు, విజిటర్స్ కు ఒక్కో గ్యాలరీ కేటాయించారు. 
  • ఈ భవనాలను రికార్డు సమయంలో ఎల్ అండ్ టీ, సీఆర్డీఏలు నిర్మించాయి. 
  • సచివాలయం ప్రాంగణంలో ఇప్పటికే పలు భవనాలు ఉన్నాయి. ఆరో భవనంగా అసెంబ్లీ, శాసనమండలిని నిర్మించారు.

  • Loading...

More Telugu News