: జంట హత్యలపై డీజీపీతో మాట్లాడిన చంద్రబాబు


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన జంట హత్యల గురించి రాష్ట్ర డీజీపీ సాంబశివరావుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. జంట హత్యల గురించి ఆయన ఆరా తీశారు. హత్యల నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ హత్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు.

హత్య వివరాల్లోకి వెళ్తే, కాకినాడలోని సుబ్బయ్య హోటల్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుబ్బయ్య హోటల్‌లో క్యాటరింగ్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అశోక్ కుమార్ ఈ దారుణానికి తెగబడ్డాడు. తనపై హోటల్ యజమానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే కోపంతో రౌడీషీటర్లు బాల, జగడం రామస్వామిలను వ్యాన్‌తో ఢీకొట్టాడు. అనంతరం వ్యాన్ దిగి రాడ్డుతో వారిని కొట్టి చంపేశాడు.

  • Loading...

More Telugu News