: కాకినాడలో రౌడీషీటర్ల దారుణ హత్య.. రాడ్డుతో కొట్టి దారుణంగా చంపిన డ్రైవర్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇద్దరు రౌడీషీటర్లు దారుణహత్యకు గురయ్యారు. సుబ్బయ్య హోటల్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుబ్బయ్య హోటల్‌లో క్యాటరింగ్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అశోక్ కుమార్ ఈ దారుణానికి తెగబడ్డాడు. తనపై హోటల్ యజమానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే కోపంతో రౌడీషీటర్లు బాల, జగడం రామస్వామిలను వ్యాన్‌తో ఢీకొట్టాడు. అనంతరం వ్యాన్ దిగి రాడ్డుతో వారిని కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.