: బ్లూగ్రీన్ నగరంగా అమరావతి.. వరద బెడద నుంచి శాశ్వత విముక్తి: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని బ్లూగ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాజధానికి వరద సమస్య లేకుండా శాశ్వత విముక్తిని కల్పించాలనే ఉద్దేశంతో సీతానగరం వద్ద రూ.237 కోట్లతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా హైదరాబాద్, ముంబై, చెన్నై తదితర నగరాలు పడుతున్న అవస్థలు చూశాక, అమరావతికి అటువంటి దుస్థితి రాకూడదనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

రాజధాని పరిధిలో కురిసే వర్షం కొండవీటి వాగుకు చేరి 12 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తుందని పేర్కొన్నారు. ఇలా వాగులోకి చేరిన నీటిలో 5వేల క్యూసెక్కులను ప్రకాశం రిజర్వాయర్‌లోకి పంపి మిగతా నీటిని  కాలువల్లోకి పంపేలా ఈ ఎత్తిపోతలకు డిజైన్ చేసినట్టు చంద్రబాబు వివరించారు. రాజధాని అమరావతికి ఉన్న అతి గొప్ప ఆస్తి నీళ్లేనని పేర్కొన్న చంద్రబాబు ఇక్కడి నుంచి 30  కిలోమీటర్ల వరకు నీళ్లే ఉన్నాయన్నారు. దీనిని రెండువైపులా ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయగలిగితే ప్రపంచంలోనే అద్భుతమైన బ్లూగ్రీన్ నగరంగా అమరాతి నిలుస్తుందన్నారు.

  • Loading...

More Telugu News