: బర్త్ డే గిఫ్ట్.. స్టాలిన్ కు నల్ల ఎద్దు అందజేత


డీఎంకే పార్టీ నేత స్టాలిన్ ఈ రోజు తన 65వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన కుటుంబసభ్యుల సమక్షంలో తన బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. అనంతరం, పలు ప్రాంతాల్లో తన అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ లను కట్ చేశారు. అయితే, తన పుట్టిన రోజుకు ఎటువంటి కానుకలు తీసుకురావద్దని, అంతగా ఇవ్వాలనిపిస్తే పుస్తకాలు ఇవ్వండని స్టాలిన్ తన అభిమానులకు సూచించాడు. ద్రవిడ ఉద్యమం, తమిళ సాహిత్యం, ఇతర అంశాలకు సంబంధించిన పుస్తకాలను స్టాలిన్ కు కానుకలుగా అందజేశారు.

కాగా, డీఎంకేకు చెందిన కొందరు నేతలు మాత్రం ఒక నల్ల ఎద్దును స్టాలిన్ కు బహూకరించారు. తమిళ సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’పై నిషేధం ఎత్తివేసి, ఈ క్రీడను తిరిగి నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, కొత్త చట్టం చేయించేందుకు స్టాలిన్ ఉద్యమించారని, ఈ ఉద్యమంలో తమను భాగస్వామ్యం చేశారని, అందుకే, ఆయనకు నల్ల ఎద్దును కానుకగా ఇచ్చామని సదరు నేతలు అన్నారు. కాగా, నల్ల ఎద్దు కొమ్ములకు డీఎంకే పార్టీ జెండాలో ఉండే ఎరుపు, నలుపు రంగులు వేసి, ఆరెంజ్-గోల్డ్ రంగులో వున్న ఓ శాలువాను ఎద్దుపై అలంకరించి స్టాలిన్ కు కానుకగా ఇవ్వడం గమనార్హం.

  • Loading...

More Telugu News