: 5 లక్షల మంది ఉద్యోగులను తొలగించనున్న చైనా పరిశ్రమలు
అదనపు మిగులు ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించే క్రమంలో చైనా ప్రభుత్వం 5 లక్షలకు మించి ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని స్టీల్, ఉక్కు వంటి ఇతర భారీ పరిశ్రమల్లో ఈ భారీ కోత ఉండనుంది. అదనపు ఉత్పత్తితో మార్కెట్లో ఉత్పత్తులు అధికంగా ఉన్న కారణంగా గ్లోబల్ ధరలు పడిపోతున్నాయని ఆ దేశ మంత్రి ఒకరు తెలిపారు. అయితే, తొలగించిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలను కూడా కల్పించనున్నట్టు పేర్కొన్నారు. అంతేగాక, సదరు ఉద్యోగులు సొంత సంస్థలు ప్రారంభించడానికి, ఉద్యోగ విరమణకు ప్రభుత్వం సాయం చేస్తుందని అన్నారు.
తమ దేశంలో గత ఏడాది కూడా 7 లక్షల 26 వేల మందిని తొలగించి ఇటువంటి సాయాన్నే అందించామని చెప్పారు. చైనాలో స్టీల్, ఉక్కు, బొగ్గు, అల్యూమినియం, సిమెంట్ లాంటి పరిశ్రమలు అధిక ఉత్పత్తి సామర్థ‍్యంతో నిండి ఉన్నాయి.