: భారీగా పాత నోట్లను జమ చేసిన 200 మందికి ఐటీ నోటీసులు
గత ఏడాది నవంబరు 8న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన అనంతరం రూ.ఒక కోటి, ఆపైన బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. బ్లాక్ మనీ నిర్మూలనలో భాగంగా 200 ఖాతాదారులకు ఈ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో జరుగుతున్న డిపాజిట్లపై నిఘా ఉంచిన ఐటీ శాఖ అక్రమార్కులకు నోటీసులు జారీ చేస్తూ వస్తున్న విషయం విదితమే.