: 2012 సంవత్సరం ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి నంది పురస్కారం
2012 సంవత్సరానికి గానూ నంది అవార్డులు అందుకోనున్న ఉత్తమ చిత్రాలు, నటులు, దర్శకుడు, టెక్నీషియన్స్ పేర్లను సినీనటి జయసుధ ఈ రోజు విజయవాడలో ప్రకటించారు. ఈగ, మిణుగురులు సినిమాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి(ఈగ) నిలిచారు. ఉత్తమ సంగీత దర్శకులుగా ఇద్దరికి అవార్డు లభించింది. ఇళయరాజా (ఎటో వెళ్లిపోయింది మనసు) ఎంఎం కీరవాణి (ఈగ) అవార్డు అందుకోనున్నారు. ఉత్తమ మాటల రచయితగా తనికెళ్ల భరణి (మిథునం), ఉత్తర కొరియోగ్రాఫర్‌గా జానీ(జులాయి), ఉత్తమ గాయనిగా గీతా మాధురి (గుడ్ మార్నింగ్), ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా కడియాల దేవికృష్ణ (ఈగ) ఎంపికయ్యారు.