: పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ మహిళా నేత అరెస్ట్


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పిల్లల అక్రమ రవాణా కేసులో తప్పించుకు తిరుగుతున్న పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా నేత జుహీ చౌదరిని గత రాత్రి భారత్ - నేపాల్ సరిహద్దుల్లో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో గత కొంతకాలంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేస్తున్న పోలీసులు, ఆమె బటాసియా ప్రాంతంలో తలదాచుకున్నట్టు గుర్తించి దాడులు జరిపి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జుహీ చౌదరి అండతో నడుస్తున్న జల్ పాయ్ గురిలోని బాలల దత్తత కేంద్రం నుంచి చిన్నారుల అక్రమ రవాణా జరుగుతోందని తేల్చిన పోలీసులు ఇప్పటికే ఆ సెంటర్ యజమాని చందనా చక్రవర్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News