: 23 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వని సుప్రీంకోర్టు


గర్భస్థ శిశువుకు గానీ తల్లి ప్రాణానికి గానీ ముప్పు ఉందని తెలిస్తే అబార్షన్‌ చేయించుకోవచ్చని ఇటీవ‌లే సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఆ ప‌రిస్థితి ఎదుర్కొన్న ఓ మహిళకు 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఇటువంటి కేసే మ‌రొక దానిపై సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. జన్యులోపాలతో పెరుగుతున్న గర్భస్థ శిశువును తొలగించుకునేందుకు అనుమతి కోరుతూ ఓ తల్లి (37) సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టుకి వైద్యులు ఆ మ‌హిళ కడుపులో డౌన్ సిండ్రోమ్ లక్షణాలు కలిగిన శిశువు పెరుగుతున్నట్టు తెలిపారు. ఆ గర్భస్థ శిశువు వయసు 23 వారాలని తెలిపారు. ఈ సిండ్రోమ్ తో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల మాదిరిగా ఉండరని, బుద్ధిమాంద్యులు అవుతారని చెప్పారు. దీంతో ఆ శిశువు కారణంగా తల్లి ప్రాణానికి ప్రమాదం వాటిల్లే అవకాశం లేనందున పిటిష‌న్ ను కొట్టివేస్తున్నట్టు సుప్రీం ప్రకటించింది.

  • Loading...

More Telugu News