: మోదీ సర్కారు మరో బాదుడు... సబ్సిడీ రహిత గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 86 పెంపు


సబ్సిడీ రహిత వంట గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణం అమల్లోకి వచ్చేలా నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పీజీ గ్యాస్ ధరను రూ. 86 మేరకు పెంచుతున్నట్టు పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ ధరలు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల సబ్సిడీతో సిలిండర్లు పొందుతున్న పేదలపై ఎలాంటి ప్రభావమూ ఉండదని పేర్కొంది. కాగా, ఈ మార్పుతో ఢిల్లీలో సబ్సిడీ రహిత సిలిండర్ ధర రూ. 737 కానుంది. సబ్సిడీతో కూడిన సిలిండర్ ధర రూ. 434గా ఉండనుంది.

  • Loading...

More Telugu News