: శ్రీనివాస్ కు ఘన నివాళి అర్పించిన అమెరికన్ కాంగ్రెస్


అమెరికాలోని కన్సాస్ పరిధిలో జాతి విద్వేష హత్యకు గురికాబడిన కూచిభొట్ల శ్రీనివాస్ కు అమెరికన్ కాంగ్రెస్ ఘన నివాళి అర్పించింది. ఆయన మృతి తమకు దిగ్భ్రాంతి కలిగించిందని చెబుతూ, నిమిషం పాటు మౌనం పాటించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, ఇటువంటి హత్యలు క్షమార్హం కావని, భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత పరిపాలన చక్కగా సాగుతోందని కితాబిచ్చుకున్నారు. తన పాలనకు 'ఏ' గ్రేడ్ ఇచ్చుకుంటున్నానని అన్నారు. తదుపరి బడ్జెట్ లో రక్షణ రంగానికి మరిన్ని నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు. జాతీయ భద్రతా సలహా సంఘంతో చర్చించి, మరిన్ని నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు. 'అమెరికా ఫస్ట్' అనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇక్కడి పౌరులందరికీ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News