: శ్రీనివాస్ కూచిభొట్ల హత్య చాలా బాధాకరం: బాలయ్య
అమెరికాలో హత్యకు గురయిన తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహానికి ఈ రోజు హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ఆయన హత్యకు గురికావడం పట్ల హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ స్పందించారు. అమెరికాలో జాత్యహంకార దాడుల్లో తెలుగు యువకుడు చనిపోవడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. శ్రీనివాస్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం కూడా అక్కడ ఉంటున్న భారతీయులకు భద్రత ఇవ్వాలని బాలకృష్ణ అన్నారు.