: జగన్ కోసమే మృతదేహాలు ఉంచాలనడం దారుణం: మ‌ంత్రి కామినేని


కృష్ణాజిల్లా నందిగామ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బ‌స్సు ప్ర‌మాద‌ బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన వైఎస్ జ‌గ‌న్ ఆ ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్ పోస్టుమార్టం రిపోర్టు అంటూ డాక్టర్ వద్ద నుంచి ఆ నివేదిక‌ను లాక్కుని హ‌ల్‌చ‌ల్ చేసిన‌ విష‌యం తెలిసిందే. అంత‌కు ముందు వైసీపీ నేత‌లు.. జ‌గ‌న్ ప‌రామ‌ర్శించ‌కుండానే ఆసుప‌త్రి నుంచి మృతదేహాల‌ను త‌ర‌లిస్తున్నార‌ని ఆందోళన చేశారు.

ఈ ఘ‌ట‌న‌ల‌పై మంత్రి కామినేని శ్రీ‌నివాస్ స్పందిస్తూ జ‌గన్ డాక్టర్ దగ్గర లాక్కుంది పోస్ట్‌మార్టం రిపోర్ట్ కాదని చెప్పారు. అదనపు డాక్టర్లతో పోస్ట్‌మార్టం పూర్తి చేసే ప్రయత్నం చేశామని చెప్పారు. జ‌గ‌న్‌ శవాలతో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆయ‌న అన్నారు. జగన్ కోసమే మృతదేహాలు ఉంచాలనడం దారుణమని అన్నారు. రెండవ డ్రైవర్ క‌నిపించ‌కుండా పోయాడ‌ని జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌ని ఆయ‌న కొట్టిపారేశారు. ఆ డ్రైవ‌ర్‌ పోలీసు‌ల అదుపులోనే ఉన్నాడని కామినేని చెప్పారు.

  • Loading...

More Telugu News