: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివాజీరాజా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ పదవీకాలం ముగిసింది. దీంతో ఈ రోజు ఆ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడి పేరును రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. నటుడు శివాజీరాజాను తాము ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలిపారు. ఇక ‘మా’ ప్రధాన కార్యదర్శిగా నరేష్ ఎన్నికయ్యారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.