: అశ్రునయనాలతో కూచిభొట్ల శ్రీనివాస్‌కు తుది వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు!


అమెరికాలో తెలుగు ఇంజినీర్‌ కూచిబొట్ల శ్రీనివాస్ హత్యకు గురయిన విష‌యం తెలిసిందే. నిన్న రాత్రి హైద‌రాబాద్ చేరుకున్న ఆయ‌న భౌతికకాయానికి ఈ రోజు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. ఆయ‌న‌ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులు, ప‌లువురు నేత‌లు హాజ‌రై ఆయ‌న‌కు తుదివీడ్కోలు ప‌లికారు. శ్రీ‌నివాస్ భార్య సున‌య‌న‌, సోదరుడు, సోదరుడి భార్య శ్రీనివాస్ తల్లిదండ్రులు క‌న్నీరు మున్నీర‌య్యారు. శ్రీ‌నివాస్ త‌ల్లిదండ్రులు హైద‌రాబాద్ శివారులోని బౌరంపేటలోని ప్రణీత్ బౌంటీలో నివాసం ఉంటున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News