: బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, చికిత్స పొందుతున్న వారి పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని హోంమంత్రి చినరాజప్ప, జిల్లా మంత్రులను ఆదేశించారు. భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం మీదుగా హైదరాబాద్ వస్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది ప్రయాణికులు మృతి చెందారు.