: వీడిన చిక్కుముడి.. ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!


పలు సమాలోచనలు, విస్తృత కసరత్తు, చర్చల తర్వాత ఎట్టకేలకు సోమవారం అర్ధరాత్రి దాటాక టీడీపీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు గతరాత్రి ఒంటిగంట సమయంలో అభ్యర్థులను ఖరారు చేశారు. తుది అభ్యర్థుల జాబితాను ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.కళావెంకట్రావు ప్రకటించారు. దాని ప్రకారం..

శ్రీకాకుళం : శత్రుచర్ల  విజయరామరాజు
తూర్పుగోదావరి :  చిక్కాల రామచంద్రరావు
పశ్చిమగోదావరి : అంగర రామ్మోహన్‌, మంతెన సత్యనారాయణరాజు
నెల్లూరు : వాకాటి నారాయణరెడ్డి
కర్నూలు : శిల్పా చక్రపాణిరెడ్డి
చిత్తూరు : రాజసింహులు (దొరబాబు)
అనంతపురం : దీపక్‌రెడ్డి
కడప : బీటెక్‌ రవి

  • Loading...

More Telugu News