: ఆ ఒక్క పార్టీ తప్ప మరెందులోనైనా చేరుతా: జయప్రద
సమాజ్‌వాదీ పార్టీ పాలనలో ఉత్తరప్రదేశ్ గూండారాజ్‌గా మారిపోయిందని మాజీ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత జయప్రద అన్నారు. ఆజంఖాన్ వంటి నేతలున్న ఆ పార్టీలో మరోమారు అడుగుపెట్టే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. సోమవారం ఆమె షిర్డీలో విలేకరులతో మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీ తప్ప ఏ పార్టీ తనను ఆహ్వానించినా చేరుతానని, కానీ ఎస్పీలో చేరే ఉద్దేశం మాత్రం తనకు లేదని స్పష్టం చేశారు. మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సరైందేనని జయప్రద కితాబిచ్చారు. ప్రధానిని ఉద్దేశించి యూపీ సీఎం అఖిలేష్ గాడిద అని సంబోధించడం సరికాదని జయప్రద అన్నారు.