: ఆస్కార్ అవార్డ్స్ వేదికపై దివంగత ఓంపురికి అరుదైన గౌరవం
లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఈ రోజు 89వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బారతీయ నటుడు దివంగత ఓం పురికి అరుదైన గౌరవం దక్కింది. మూడు నెలల క్రితం కన్నుమూసిన ఓం పురి.. గతంలో పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గత ఏడాది మృతి చెందిన హాలీవుడ్ లెజెండ్స్‌కి నివాళి అర్పించిన నిర్వాహకులు ఆ లెజెండ్స్ జాబితాలో మన ఓంపురి పేరు కూడా చేర్చి ఆయనకి నివాళులు అర్పించారు. ఓంపురి బాలీవుడ్, తెలుగు, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలతో పాటు, పాకిస్థానీ, హాలీవుడ్ సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనపడ్డారు. ఉమామహేశ్వరరావు తీసిన ‘అంకురం’, రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘రాత్రి’ సినిమాలలో ముఖ్య పాత్రల్లో కనిపించిన సంగతి విదితమే!