: బాహుబలి ప్రభాస్‌తో నాకు పెద్ద గొడవైంది.. అప్పటి నుంచి మాట్లాడలేదు: కంగనా రనౌత్
బాలీవుడ్ నటులు సైప్ అలిఖాన్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘రంగూన్’ ఈ నెల 24న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో భాగంగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హైదరాబాద్‌కి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... బాహుబలి ప్రభాస్ తో తాను గతంలో పడ్డ గొడవను గుర్తు చేసుకుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘ఏక్‌నిరంజన్’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి కంగనా నటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమా చేసే సమయంలో ప్రభాస్ కు, తనకు మధ్య పెద్ద గొడవైందని చెప్పింది. దీంతో తమ ఇద్దరి మధ్య మాటల్లేకుండా పోయాయని, అప్పటి నుంచి అతనితో తాను టచ్‌లో లేనని చెప్పింది.
ఇన్నాళ్ల తరువాత తాను ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమా చూసి ఆశ్చర్యపోయానని, అందులో ప్రభాస్ నటన, విన్యాసాలు చూసి ఆశ్చర్యపోయానని కంగనా రనౌత్ తెలిపింది. ఆ సినిమాలో ప్రభాస్‌ని అలా చూసినపుడు తనకు ఎంతో సంతోషం వేసిందని, ప్రస్తుతం తన కెరీర్ చూసి కూడా ప్రభాస్ గర్వపడుతుండవచ్చని పేర్కొంది.