: విమానంలో నిర్ణయాత్మక శక్తి తగ్గుతుందిట


ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు అని చెబుతుంది భగవద్గీత. అయితే విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు అని చెబుతున్నాయి.. ఆధునిక అధ్యయనాలు. అత్యంత ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో.. గాలి పీడనం, ఒత్తిడిలో తేడాల కారణంగా ఆలోచన శక్తి తగ్గుతుందని వారంటున్నారు. ఆక్సిజన్‌ తక్కువగా అందడం వలన మెదడు పనితీరు మందగిస్తుందని ప్రముఖ ఏరోస్పేస్‌ ఔషధ నిపుణుడు లండన్‌లోని కింగ్స్‌ కాలేజీకి చెందిన డేవిడ్‌ గ్రాడ్‌వెల్‌ చెప్పారు.

విమానాల క్యాబిన్‌లలో పీడనం ఉంటుంది గానీ.. అది 6 నుంచి 8 వేల అడుగుల ఎత్తులోని పీడనానికి సమానంగా ఉంటుందట . ఆ తర్వాత గాలి పలచబడి మెదడుకు ఆక్సిజన్‌ తక్కువగా అందుతుందిట. అందుకే విమానంలో ఉండగా ముఖ్యమైన మెయిల్స్‌కు జవాబివ్వడం సరికాదంటున్నారు. విమానం నుంచి దిగగానే గాలి వెలుతురు తక్కువగా ఉండే చోట్లకు వెళ్లకూడదట. శరీరం కాస్త నార్మల్‌ పొజిషన్‌కు రావాలంటే.. సూర్యరశ్మి పడేచోట ఉండడమే మంచిదని గ్రాడ్‌ వెల్‌ గ్రాండ్‌ సలహా.

  • Loading...

More Telugu News