: తమిళనాడులో తెలుగు విద్యార్థులకు ఉపశమనం!
తమిళనాడులో తెలుగు విద్యార్థులకు ఉపశమనం కలిగింది. ఆ రాష్ట్రంలో తెలుగు భాషలో పరీక్షలు నిర్వహించబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో అక్కడి తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. ఆ విద్యార్థులను ఆదుకోవాలని తెలుగువారి నుంచి పలు విజ్ఞప్తులు వచ్చినప్పటికీ ఇన్ని నెలలూ ఫలితం లేకుండా పోయింది. అయితే, ఈ విషయంపై మద్రాసు హైకోర్టులో ఒకరు వేసిన పిటిషన్‌పై ఈ రోజు తీర్పు వచ్చింది. తమిళనాడులో పదోతరగతి పరీక్షను ఈ సంవత్సరం తెలుగులో రాసేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలోని తెలుగు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.