: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా లోకేశ్ కు ఖాయమైన బెర్త్
యువనేత లోకేశ్ ను ఎమ్మెల్సీగా పంపి ఆపై మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. స్థానిక సంస్థలు లేదా పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పాల్గొనకుండా, ఎమ్మెల్యేల కోటాలో లోకేశ్ ను ఎమ్మెల్సీగా పంపాలని టీడీపీ పాలిట్ బ్యూరో నిర్ణయించింది. వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఐదు స్థానాలు ఖాయంగా లభించనున్నాయి. దీంతో లోకేశ్ ను ఈ కోటాలోనే ఎమ్మెల్సీని చేయాలని పార్టీ నేతలు ప్రస్తావించడంతో, చంద్రబాబు కూడా అందుకు అంగీకరించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈ ప్రతిపాదన చేయగా, మిగతా పాలిట్ బ్యూరో సభ్యులంతా ముక్తకంఠంతో మద్దతిచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఎమ్మెల్యేల కోటాకు సంబంధించి రేపు నోటిఫికేషన్ వెలువడనుండగా, నామినేషన్లకు 28వ తేదీ ఆఖరు.