: సినిమాల్లో బిజీ అవుతున్న ‘బిత్తిరి సత్తి’!
బుల్లితెరపై 'తీన్ మార్' న్యూస్ లో తెలంగాణ భాష మాట్లాడుతూ ఎంతో పాప్యులర్ అయిన బిత్తిరి సత్తికి ఇప్పుడు ఎన్నో సినిమా అవకాశాలు వస్తున్నాయట. దీంతో ఎంతో బిజీ అయిపోయిన ఆయన ఇకపై బుల్లితెరపై కనిపించే అవకాశం ఉండక పోవచ్చని టాక్. సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సత్తి.. ప్రత్యేకంగా ఓ మేనేజర్ ను కూడా నియమించుకున్నట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'విన్నర్' సినిమాలో బిత్తిరిసత్తి కురిపించిన నవ్వుల జల్లుకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఆయనకు ఎన్నో సినీ అవకాశాలు వస్తున్నాయి.
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రానున్న 'గౌతమ్ నంద' సినిమాలోనూ సత్తి పూర్తి స్థాయిలో కనిపించనున్నాడు. అంతేగాక పలు సినిమా అవకాశాలు ఇప్పుడు ఆయన ముందు ఉన్నాయి. బుల్లితెరపై బిత్తిరి సత్తిగా నవ్విస్తోన్న ఆయన అసలు పేరు చేవెళ్ల రవి. బిత్తిరి సత్తి రంగారెడ్డి జిల్లా పమేనా గ్రామానికి చెందిన వాడు.