: నేను చాలా సార్లు పవన్ కల్యాణ్ స్పీచ్ విన్నాను.. ఆయన విజన్ బాగుంది: గుత్తా జ్వాల
తాను చాలా సార్లు పవన్ కల్యాణ్ స్పీచ్ విన్నానని, ఆయన విజన్ బాగుందని బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల అన్నారు. ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... పవన్‌కి ఇంకా ఎంతో సపోర్ట్ కావాలని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారు పవన్ ని పైకి రానిస్తారా? అని ఆమె సందేహం వ్యక్తం చేశారు. పవన్ విద్య, వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడతారని, వాటిని సపోర్ట్ చేస్తారని ఆమె అన్నారు. ఆయన యువత నుంచి భారీగా మద్దతు పొందాల్సి ఉందని చెప్పారు.
ఇక తాను కూడా సమాజానికి ఏదో మంచి చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. తనకి కూడా రాజకీయాల్లోకి రావాలని ఉందని అన్నారు. అయితే, రాజకీయాలు అనుకున్నంత ఈజీ కాదని, తాను బ్యాడ్మింటన్ కోర్ట్‌లో దిగితే 100 శాతం రాణిస్తానని, అయితే, రాజకీయాలు అందుకు పూర్తి విభిన్నం కాబట్టి ఎంతో శ్రమించాల్సి ఉంటుందని చెప్పారు.