: అన్న‌దాత‌లు చేస్తోన్న పోరాటానికి మద్దతుగా యువ‌త ముందుకు రావాలి: తమిళ యువతకు క‌మ‌లహాస‌న్ పిలుపు


త‌మిళ‌నాడులోని పుదుకొట్టాయి జిల్లా నెదువ‌సాల్‌లో నిర్మించ‌త‌ల‌పెట్టిన హైడ్రో కార్భ‌న్ ప్రాజెక్ట్‌ కు వ్య‌తిరేకంగా ఆ ప్రాంత రైతులు పోరు ఉద్ధృతం చేశారు. కేంద్ర క‌మిటీ త్వ‌ర‌లోనే ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో రైతులు కొన్ని రోజులుగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లకు దిగుతున్నారు. ఈ క్రమంలో, వారి పోరాటానికి సినీన‌టుడు క‌మ‌ల హాస‌న్ మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. అన్న‌దాత‌లు చేస్తోన్న పోరాటానికి రాష్ట్ర యువ‌త కూడా ముందుకు రావాల‌ని ఆయ‌న కోరారు. పుదుచ్చేరి సీఎం ఇక్క‌డి రైతుల పోరాటానికి సంఘీభావం తెల‌ప‌డం హర్షణీయమని పేర్కొన్నారు. మ‌రోవైపు రైతులు ఫిబ్ర‌వ‌రి 28న భారీ ఆందోళ‌న నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.







  • Loading...

More Telugu News