: రేప‌టి నుంచే ఏపీ కొత్త అసెంబ్లీలో విధులు ప్రారంభం!


ఈ రోజు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన టీడీపీ పొలిట్ బ్యూరో స‌మావేశంలో ఏపీ అసెంబ్లీ ప్రారంభోత్స‌వం కోసం ముహూర్తం ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. వ‌చ్చేనెల‌ రెండో తేదీన ఉదయం 11:25 గంటలకు రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి  చంద్రబాబు నాయుడు అసెంబ్లీని ప్రారంభించనున్నారు. అయితే, అసెంబ్లీ భ‌వ‌నంలో సిబ్బంది మాత్రం రేప‌టి నుంచే విధులు ప్రారంభించ‌నున్నారు. రేపు ఉద‌యం 11.30  గంటలకు ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు సభాపతి కోడెల శివ‌ప్ర‌సాద్ రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొంటారు. వ‌చ్చేనెల 6 నుంచి అమ‌రావ‌తిలో తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి.

  • Loading...

More Telugu News