: అప్పట్లో రోజుకు 40 సిగరెట్లు తాగేసిన బాలుడు.. ప్రస్తుతం అందరి పిల్లల్లాగే ఆడుకుంటున్నాడు!


ఇండోనేసియాకు చెందిన రెండేళ్ల అర్ది రిజల్ అనే బాలుడు సిగరెట్లకు బానిసగా మారి రోజుకు 40 సిగరెట్లను తాగేవాడు. ఈ వార్త 2010లో ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అయింది. ఈ బాలుడి ప్ర‌వ‌ర్త‌న‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోవ‌డం అంద‌రి వంతూ అయింది. అనంత‌రం ఈ బాలుడి అల‌వాటుపై స్పందించిన ఆ దేశ ప్ర‌భుత్వం ఆ పిల్లాడితో సిగ‌రెట్లు మాన్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో ఆ పిల్లాడు ఇప్పుడు అంద‌రి పిల్ల‌ల‌లాగే ఆడుతూ పాడుతూ కనిపిస్తున్నాడు.

కాగా, మొద‌ట్లో ఆ చిన్నారి సిగరెట్లు మానేయడంతో ఆ పిల్లాడిలో ఆకలి విపరీతంగా పెరిగింది. దీంతో బాగా ఆహారం తినేసేవాడు. సిగరెట్ తాగొద్దని చెప్పిన తన తల్లిని బొమ్మలు కొనివ్వాలని డిమాండ్ చేసేవాడట. తలను గోడకేసి బాదుకునేవాడట. బాగా తినడంతో ఆరేళ్లు వచ్చే సరికి అర్ధి 80 కిలోల బరువు పెరిగాడు. అనంతరం చికిత్స చేయించుకోవడంతో ఇప్పుడు ఆరోగ్యంగా తయారయ్యాడు. ఆ బాలుడికి ఇప్పుడు తొమ్మిదేళ్లు.

  • Loading...

More Telugu News